బనకచర్లతో తెలంగాణకు నష్టం లేదు - సీఎం
NEWS Jul 07,2025 03:21 am
బనకచర్ల ప్రాజెక్టు నిర్మించడం వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఎలాంటి నష్టం వాటిల్లదని పేర్కొన్నారు సీఎం చంద్రబాబు. ప్రాజెక్టుకు సంబంధించి తీవ్ర అభ్యంతరం తెలిపిన కేంద్ర నీటి పారుదల కమిషన్ (సీడబ్ల్యూసీ)కి వివరణ ఇచ్చేందుకు తాము సిద్దంగా ఉన్నామన్నారు. జల వనరుల శాఖ డేటా ఆధారంగా పూర్తిగా నివేదిక తయారు చేయాలని ఆదేశించారు. గోదావరి, కృష్ణా మిగులు జలాలను మాత్రమే తాము వాడుకుంటున్నామని స్పష్టం చేశారు.