కేటీఆర్ నీకు అంత సీన్ లేదు - సామ
NEWS Jul 07,2025 03:23 am
టీపీసీసీ స్పోక్స్ పర్సన్ సామ నరసింహా రెడ్డి కేటీఆర్ పై మండిపడ్డారు. దమ్ముంటే అమర వీరుల స్థూపం వద్దకు రావాలని , అన్నింటిపై చర్చ చేద్దామని సవాల్ విసిరారు. మీ హయాంలో రేవంత్ రెడ్డి అంటే ఎవరని ఎద్దేవా చేశావని, కానీ ఇప్పుడు తన పక్కన పేరు ఉండేలా తహ తహ లాడుతున్నాడంటూ సెటైర్ వేశారు. 10 ఏళ్ల రాచరిక, దొర పాలనకు చరమగీతం పాడిన దమ్మున్న లీడర్ తమ నాయకుడని గుర్తు పెట్టుకోవాలన్నారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం మానుకోవాలని హితవు పలికారు.