విద్య, వైద్యం కల్పించడం సర్కార్ బాధ్యత
NEWS Jul 06,2025 07:38 pm
సమాజానికి విద్య, వైద్యం రెండు కళ్లు లాంటివని అన్నారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఈ రెండు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన దానికంటే తమ సర్కార్ పేద పిల్లల కోసం 10 రెట్లు ఎక్కువ ఖర్చు చేస్తోందన్నారు. ఇందులో భాగంగానే మునుగోడు నియోజకవర్గంలో రూ. 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ను ఏర్పాటు చేస్తున్నామన్నారు.