ఆ చిన్నారిని కడతేర్చింది చిన్నమ్మనేనా..?
NEWS Jul 06,2025 08:46 am
కోరుట్లలో జరిగిన చిన్నారి హీక్షిత (5) హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించినట్లుగా తెలుస్తోంది. చిన్నారి హత్యకు వరుసకు చిన్నమ్మ అయిన మమతను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆమె నుంచి హత్యకు ఉపయోగించిన కత్తి, బట్టలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ముక్కుపచ్చలారని ఆ చిన్నారిని కడతేర్చింది చిన్నమ్మనేనా..? అంటూ స్థానికులు చర్చించుకుంటున్నారు.