బరాబర్ ప్రశ్నిస్తూనే ఉంటాం - బొత్స
NEWS Jul 06,2025 09:51 am
కూటమి సర్కార్ వైఫల్యాల గురించి బరాబర్ ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. ప్రజల తరపున తమ వాయిస్ వినిస్తామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చలేదో చంద్రబాబు చెప్పాలన్నారు. ఇదేమని ప్రశ్నిస్తే తాట తీస్తానంటూ పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇస్తున్నారని, ఇందుకోసమేనా మిమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నది అంటూ నిలదీశారు. బాధ్యత కలిగిన పార్టీగా తాము సమస్యలను ప్రస్తావిస్తామన్నారు.