కేటీఆర్ కు మంత్రి సీతక్క కౌంటర్
NEWS Jul 06,2025 09:31 am
సీఎం రేవంత్ రెడ్డి విసిరిన సవాల్ కేటీఆర్ కు అర్దం కానట్లు ఉందన్నారు మంత్రి సీతక్క. అసెంబ్లీలో చర్చిద్దాం రా అంటే ప్రెస్ క్లబ్ కు రమ్మనడం ఏంటి అంటూ ప్రశ్నించారు. డెడ్ అయిన పార్టీ డెడ్ లైన్ పెట్టడం విడ్డూరంగా ఉందన్నారు. తన కోసం ఎవరూ ఇక్కడ ఎదురు చూడడం లేదన్నారు. నీ స్వంత చెల్లెలు కవిత నిన్ను నాయకుడిగా గుర్తించడం లేదంటూ ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష హోదా ఉన్న మీ నాయినను అసెంబ్లీకి రమ్మను చర్చిస్తామన్నారు.