ఇబ్రహీంపట్నంలో ఉచిత ఉపాధి శిక్షణ
NEWS Jul 06,2025 08:45 am
గ్రామీణ ప్రాంతాలకు చెందిన నిరుద్యోగ యువతకు శ్రీ బాలచంద్ర అభయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత ఉపాధి శిక్షణ ఇవ్వనున్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలోని అభయ ఆనంద నిలయంలో ఉచిత భోజనం, వసతితో ట్రైనింగ్ ఇస్తామని నిర్వాహకులు తెలిపారు. పూర్తి వివరాలకు 9515823052 ఫోన్ నెంబర్‌లో సంప్రదించాలని సూచించారు.