రెండ్రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
NEWS Jul 05,2025 12:32 pm
టీటీడీ కీలక ప్రకటన చేసింది. 15న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, 16న శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం ఉన్న కారణంగా రెండు రోజుల పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు తెలిపింది. 14, 15వ తేదీలలో ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలకు సిఫార్సు లేఖలు స్వీకరించడం జరగదని స్పష్టం చేసింది. భక్తులు సహకరించాలని కోరారు ఈవో జె. శ్యామల రావు.