చిన్నారులపై దాడి చేసిన వారిని వదలను: రేవంత్ హెచ్చరిక
NEWS Jul 05,2025 12:47 pm
చిన్నారులపై లైంగిక దాడి చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టేదే లేదన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. మహిళలు, పిల్లల రక్షణకు తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.