తెలంగాణలో కోవర్టుల పాలన - కేటీఆర్
NEWS Jul 05,2025 08:02 am
సీఎం రేవంత్ రెడ్డి విసిరిన సవాల్ ను తాను స్వీకరిస్తున్నానని ప్రకటించారు మాజీ మంత్రి కేటీఆర్. వ్యవసాయాన్ని పండుగలా చేసింది ఎవరో తెలంగాణలో ఏ రైతును అడిగినా చెప్తారన్నారు. ధాన్యం ఉత్పత్తిలో పంజాబ్, హర్యానా లాంటి రాష్ట్రాలను వెనక్కి నెట్టి తెలంగాణను నెంబర్ వన్ చేసింది కేసీఆర్ అన్న విషయం మరిచి పోతే ఎలా అన్నారు. సవాళ్లు, బూతులు, డైలాగులు రేవంత్ కు అలవాటుగా మారిందన్నారు.