జూరాల ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద
NEWS Jul 05,2025 04:39 am
ఎగువన కురుస్తున్న వర్షాలకు జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. 14 గేట్లు ఎత్తి దిగువకు నీళ్లను వదిలారు. ఇన్ ఫ్లో 1,15,000 క్యూసెక్కులు కాగా ఔట్ ఫ్లో లక్షా 35 వేల 219 క్యూసెక్కులు ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా ప్రస్తుత నీటిమట్టం 317.510 మీటర్లు ఉంది. నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుత సామర్థ్యం 7.663 టీఎంసీలుగా ఉంది. ప్రస్తుతం జూరాల ఎగువ, దిగువ జల విద్యుత్ కేంద్రాలలో 11 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.