జడ్జీల ఎంపికలో పారదర్శకత - సీజేఐ
NEWS Jul 05,2025 04:40 am
కొలిజియం సిఫార్సు మేరకు జడ్జీల ఎంపికలో పూర్తి పారదర్శకత ఉండేలా చూస్తామని స్పష్టం చేశారు సీజేఐ జస్టిస్ గవాయ్. పెద్ద ఎత్తున న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉండడం వల్లే భారీగా కేసులు పెండింగ్ లో ఉన్నాయని అన్నారు. తాను బాధ్యతలు చేపట్టాక కేసుల పరిష్కారంపై ఎక్కువగా ఫోకస్ పెట్టామన్నారు. దేశ వ్యాప్తంగా ఎవరైనా సరే నేరుగా ఫిర్యాదు చేసేందుకు అవకాశం కల్పించామని తెలిపారు. అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యత ఉండేలా చర్యలు తీసుకుంటానని చెప్పారు.