తెలంగాణలో పదేళ్లు కాంగ్రెస్ దే అధికారం
NEWS Jul 04,2025 03:12 pm
తెలంగాణలో 10 ఏళ్ల పాటు మనమే పవర్ లో ఉంటామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పార్టీ పదవితోనే అందరికీ గౌరవం, గుర్తింపు లభిస్తుందన్నారు. రాబోయే రోజుల్లో అసెంబ్లీ, పార్లమెంట్ సీట్లు పెరగబోతున్నాయని తెలిపారు. నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్, జమిలి ఎన్నికలు ప్రభావితం చేయబోతున్నాయని చెప్పారు. నూతన నాయకత్వానికి 2029 ఎన్నికలు వేదిక కావాలన్నారు. నేతలుగా ఎదగాలంటే ఇప్పటి నుంచే కష్ట పడాలని పిలుపునిచ్చారు. ఖర్గేను స్పూర్తిగా తీసుకోవాలని సూచించారు.