BRS యూత్ నాయకుల ముందస్తు అరెస్ట్
NEWS Jul 04,2025 02:41 pm
హైదరాబాద్ చలో సెక్రటేరియట్ పిలుపులో భాగంగా ఓదెల మండలంలో బీఆర్ఎస్, యూత్, విద్యార్థి నాయకులను పోత్కపల్లి పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. ఈసందర్బంగా బీఆర్ఎస్ యూత్ నాయకుల శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అబద్దాల హామీలతో గద్దెనెక్కి విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. ఎన్నికల హామీలో ఇచ్చిన విధంగా జాబ్ క్యాలెండర్ ను వెంటనే రిలీజ్ చేయాలన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చి తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు.