రోడ్డు ప్రమాదంలో ఫుట్ బాల్ ప్లేయర్ మృతి
NEWS Jul 03,2025 11:19 am
స్పెయిన్ లోని జమెరా సమీపంలో జరిగిన కారు ప్రమాదంలో టాప్ ఫుట్ బాల్ ప్లేయర్ డియోగో జోటా మృతి చెందాడు. లివర్ పూల్ ఫుట్ బాల్ క్లబ్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. పోర్చుగీస్ నేషనల్ టీంలో ఫార్వర్డ్ ప్లేయర్ గా గుర్తింపు పొందాడు. తన వయసు కేవలం 28 ఏళ్లు మాత్రమే. చిన్న వయసులోనే వేలాది మంది అభిమానులను తన ఆట తీరుతో ఆకట్టుకున్నాడు. జోటా మృతితో విషాదం అలుముకుంది.