బనకచర్లపై బాబు, రేవంత్ డ్రామాలు
NEWS Jul 03,2025 11:21 am
బనకచర్ల ప్రాజెక్టుపై ఏపీ, తెలంగాణ సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డిలు డ్రామాలు ఆడుతున్నారంటూ సంచలన కామెంట్స్ చేశారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి. ఇద్దరూ గురు శిష్యులేనని ప్రజలందరికీ తెలుసన్నారు. డైవర్షన్ పాలిటిక్స్ చేయడంలో బాబు ఎక్స్ పర్ట్ అంటూ ఎద్దేవా చేశారు. ఈ ఇద్దరికీ ప్రచార ఆర్భాటం తప్పా ప్రజలకు మంచి చేద్దామన్న సోయి లేదన్నారు.