అంగన్వాడీ హెల్పర్ల వయోపరిమితి పెంపు
NEWS Jul 03,2025 11:26 am
తెలంగాణ సర్కార్ తీపి కబురు చెప్పింది అంగన్వాడీ హెల్పర్లకు. టీచర్లుగా ప్రమోషన్ పొందేందుకు గాను ఇప్పటి వరకు ఉన్న 45 ఏళ్ల పరిమితిని 50 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీని వల్ల 45 ఏళ్లు దాటిన 4,322 మంది సహాయకులకు మేలు చేకూరుతుంది. త్వరలో అధికారికంగా ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపారు మంత్రి సీతక్క.