హరీశ్ రావు ఎవరో తెలీదు - కోమటిరెడ్డి
NEWS Jul 03,2025 11:33 am
హరీశ్ రావు ఎవరో తనకు తెలియదన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. కేటీఆర్, కవిత తన లెక్కలోకి రారన్నారు. కేసీఆర్ గనుక శాసనసభకు వస్తే అన్ని అంశాలపై చర్చ జరిపేందుకు రెడీగా ఉన్నామన్నారు. హరీశ్ ఎమ్మెల్యే..తనకు అంత సీన్ లేదన్నారు. మాజీ సీఎం వచ్చి సలహాలు ఇస్తే తీసుకుంటాం, తప్పులు ఎత్తి చూపితే సరిదిద్దు కుంటామని అన్నారు.