వంశీ అరెస్ట్ వల్ల ఏం సాధించారు.?
NEWS Jul 02,2025 04:58 pm
మాజీ మంత్రి పేర్ని నాని ఏపీ సర్కార్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వల్లభనేని వంశీని అరెస్ట్ చేసి శునకానందం పొందుతున్నారంటూ మండిపడ్డారు. తనను అరెస్ట్ చేసి ఏం సాధించారంటూ ప్రశ్నించారు. సర్కార్ తన గొయ్యి తానే తవ్వుకుందన్నారు. కక్ష పూరితంగా ఎన్ని కేసులు పెట్టి వేధించినా తను గన్నవరం విడిచి పారిపోయే ప్రసక్తే లేదన్నారు. అరెస్ట్ చేయడం వల్ల వంశీకి ప్రజల్లో సానుభూతి పెరిగిందన్నారు.