నన్ను ఎన్నుకుంటే యోగి లాగా పని చేస్తా
NEWS Jun 30,2025 09:33 am
బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన కామెంట్స్ చేశారు. తనను గనుక రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నుకుంటే యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ లాగా పని చేస్తానని అన్నారు. ఒక్కసారి తనకు ఛాన్స్ ఇవ్వాలని పార్టీ హైకమాండ్ ను కోరాడు. తనను చాలామంది కార్యకర్తలు కోరుకుంటున్నారని అన్నారు. గోరక్షణ విభాగం ఏర్పాటు చేసి, గోరక్షకులకు అండగా నిలుస్తానని చెప్పారు. తెలంగాణను యూపీగా మారుస్తానని అన్నారు.