ఎమ్మెల్సీ కవిత ‘తెలంగాణ జాగృతి’ నూతన కార్యాలయాన్ని బంజారాహిల్స్‌లో ఏర్పాటు చేశారు. తెలంగాణ జాగృతి బ్యానర్‌లో ఆచార్య జయశంకర్, కేసీఆర్ ఫొటోలను పెట్టారు. కొత్త ఆఫీసులో బీఆర్ అంబేడ్కర్, ఆచార్య జయశంకర్, తెలంగాణ తల్లి, జ్యోతిబా ఫులే, సావిత్రిబాయి ఫులే విగ్రహాలతో పాటు అమరవీరుల స్థూపాన్ని ఏర్పాటు చేశారు.