రాష్ట్ర విభజనపై లోకేష్ కామెంట్స్
NEWS May 16,2025 01:15 pm
రాష్ట్ర విభజన జరిగి 11 ఏళ్లవుతున్నా ఇంకా ఏపీకి చెందిన నేతలు మాత్రం తమ తీరు మార్చు కోవడం లేదు. ఏ పార్టీ అయినా తమకు అన్యాయం జరిగిందంటూ వాపోవడం తప్పితే చేసింది ఏమీ లేదు. తాజాగా మంత్రి నారా లోకేష్ నోరు పారేసుకున్నారు. 2014 లో రాష్ట్ర విభజన జరిగినప్పుడు కట్టుబట్టలతో మెడలు పట్టుకొని మనల్ని బయటికి గెంటేశారంటూ వాపోయారు. ఆయన చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.