టిటిడికి రూ.1.40 కోట్ల ఎన్నారై భక్తుడి విరాళం
NEWS May 16,2025 09:57 am
అమెరికాలోని బోస్టన్‌కు చెందిన ప్రవాసాంధ్రుడు ఆనంద్ మోహన్ భాగవతుల టిటిడిలోని వివిధ ట్రస్టులకు రూ.1.40 కోట్లకు పైగా విరాళాన్ని అందించారు. తిరుమలలోని టిటిడి ఛైర్మన్ క్యాంప్ కార్యాలయంలో టిటిడి చైర్మన్ బీ ఆర్ నాయుడుకు విరాళాలకు సంబంధించిన డిడిలను దాత అందజేశారు.