రాష్ట్రంలో భారీగా తహసీల్దార్ల బదిలీలు
NEWS May 16,2025 09:52 am
తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రెవిన్యూ శాఖలో పెద్ద ఎత్తున బదిలీలకు తెర తీసింది. ఈ మేరకు అధిక సంఖ్యలో తహసిల్దార్లను బదిలీ చేసింది. మల్టీ జోన్ -1 లో 55 మందిని, జోన్ -2 లో 44 మందిని మొత్తం 99 మంది తహసిల్దార్లకు ఝలక్ ఇచ్చింది. ఈ మేరకు తహసిల్దార్లను బదిలీ చేస్తూ రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రెటరీ నవీన్ మిట్టల్ ఉత్తర్వులు జారీ చేశారు.