అందాల పోటీలను వాయిదా వేయాలి
NEWS May 10,2025 07:06 am
ఓ పక్క యుద్దం జరుగుతుంటే ఇంకో వైపు హైదరాబాద్ లో కాంగ్రెస్ సర్కార్ మిస్ వరల్డ్ 2025 పోటీలు నిర్వహించడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఒకపక్క యుద్ధం జరుగుతుంటే మరోపక్క ఈ అందాల పోటీలు నిర్వహించడం కరెక్ట్ కాదన్నారు. ఐపీఎల్ ను ఎలాగైతే వాయిదా వేశారో మిస్ వరల్డ్ పోటీలను కూడా అలానే వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. వాయిదా వేసుకోకపోతే ప్రపంచానికి వేరే రకమైన సందేశం పోతుందన్నారు.