కేంద్ర ఎన్డీఏ సర్కార్ ఇటీవలే కేంద్ర మంత్రిమండలి సమావేశంలో జనగణతో పాటు కులగణనకు అనుమతిస్తూ తీర్మానించడాన్ని కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తుందని కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు బొర్రా కిరణ్ తెలిపారు. రానున్న 6 నెలల్లో జరగనున్న బీహార్, ఉత్తరప్రదేశ్ ఎన్నికల దృష్ట్యా ఇలాంటి రాజకీయ అవసరాల కోసం తీసుకున్న రాజకీయ ఎత్తుగడలని ఆయన ఆరోపించారు.