డీలిమిటేషన్ ను అంగీకరించేది లేదు
NEWS Mar 22,2025 04:26 pm
డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుందన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ . తమిళనాడులోని చెన్నైలో జరిగిన సమావేశానికి ఆయన సీఎం రేవంత్ రెడ్డితో కలిసి హాజరయ్యారు. ఈ సందర్బంగా సీరియస్ కామెంట్స్ చేశారు. జనాభా ప్రకారం డీలిమిటేషన్ చేస్తే సీట్లు తగ్గుతాయన్నారు. అన్ని కార్యకలాపాలకు విఘాతం ఏర్పడే ప్రమాదం ఉందన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ డీ లిమిటేషన్ ను అంగీకరించే ప్రసక్తి లేదన్నారు టీపీసీసీ చీఫ్.