సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు మాజీ సీఎం కేసీఆర్ పై. బలంగా కొట్టడం కాదు ముందు నువ్వు కట్టె సాయం లేకుండా ఒంటరిగా నిలబడి చూపాలని సవాల్ విసిరారు. లేనిపోని అభాండాలు వేయడం, అసత్య ఆరోపణలు చేయడం పనిగా పెట్టుకున్నారంటూ మండిపడ్డారు. కేసీఆర్ కామెంట్స్ కు రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. టిక్ టాక్ లో పోల్ పెడితే తనకు ఎక్కువ లైక్ లు ఎలా వస్తాయంటూ ప్రశ్నించారు. ప్రజలు తిరస్కరిస్తే తట్టుకోలేక ఫామ్ హౌస్ లో పడుకున్న కేసీఆర్ ను జనం ఆదరిస్తారంటే నమ్మగలమా అన్నారు.