సీఎం రేవంత్ రెడ్డిపై సీరియస్ అయ్యారు బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. అధికారం ఉంది కదా అని మాట్లాడితే చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదన్నారు. పూర్తిగా కుల దురహంకారంతో వ్యవహరిస్తున్న సీఎంకు తనను విమర్శించే నైతిక హక్కు లేదని మండిపడ్డారు. పదవిని అడ్డం పెట్టుకుని కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. నీకు అంత సీన్ లేదంటూ ఫైర్ అయ్యారు.