ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్
NEWS Jan 29,2025 07:48 am
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. గ్రాడ్యూయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసింది. ఎన్నికలకు సంబంధించి వచ్చే ఫిబ్రవరి 3న నోటిఫికేషన్ రిలీజ్ కానుంది. 27న పోలింగ్ ప్రక్రియ జరుగుతుంది. మార్చి 2న ఓట్లను లెక్కిస్తారు. అదే రోజు ఫలితాలను ప్రకటిస్తారు. రాష్ట్రంలో రెండు టీచర్ , ఒక గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. వరంగల్ - ఖమ్మం - నల్లగొండ , మెదక్ - నిజామాబాద్ - ఆదిలాబాద్ - కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి , నిజామాబాద్ - కరీంనగర్ - ఆదిలాబాద్ పట్టభద్రుల స్థానానికి ఎలక్షన్ జరగనుంది.