పంచాయతీ ఎన్నికలకు సామాగ్రి సిద్ధం
NEWS Jan 27,2025 02:47 pm
రానున్న పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సామాగ్రి సిద్ధంగా ఉంచాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. సోమవారం జిల్లా ఎస్పీ కార్యాలయం సమీపంలోని గోదాములోని పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఉపయోగించే సామాగ్రిని, బ్యాలెట్ బాక్స్ లను పరిశీలించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నుండి సరఫరా అయిన పంచాయతీ ఎన్నికలకు వినియోగించే కవర్లు, వివిధ రకాల ఫారాలు, బ్యాలెట్ బాక్స్ లు, ఇతర సామాగ్రిని , మండలాల వారిగా ఏర్పాట్లు చేయాలనీ సిబ్బందికి ఆదేశించారు.