ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు షాకింగ్ కామెంట్స్ చేశారు. మంత్రి నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం ఇవ్వాలని తాము డిమాండ్ చేయడం లేదన్నారు. ఇవ్వాలా లేదా అన్నది తాము నిర్ణయించమని, ప్రజలు నిర్ణయిస్తారని స్పష్టం చేశారు. కొందరు మంత్రులు, సీనియర్లు డిప్యూటీ సీఎం చేయాలన్న డిమాండ్ చేయడం తన దృష్టికి కూడా వచ్చిందన్నారు. అదంతా హైకమాండ్ చూసుకుంటుందన్నారు. స్పీకర్ చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.