కుంభ మేళాలో ఘనంగా శ్రీనివాస కళ్యాణం
NEWS Jan 27,2025 04:34 am
మహా కుంభమేళా సందర్భంగా శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీనివాస కల్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. వేద మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కంకణ ధారణ, అగ్ని ప్రతిష్టాపన, యజమాని సంకల్పం, భక్త సంకల్పం, మహా సంకల్పం, మాంగళ్య పూజ, మంగళ సూత్రధారణ మొదలైన ఘట్టాలతో శాస్త్రోక్తంగా శ్రీ స్వామి అమ్మవార్ల కల్యాణాన్ని చేపట్టారు.