బీజేపీ నూతన జిల్లా అధ్యక్షుడికి పలువురు అభినందనలు
NEWS Jan 21,2025 12:13 pm
అంబేద్కర్ కోనసీమ జిల్లా బీజేపీ అధ్యక్షులుగా నియమితులైన అడబాల సత్యనారాయణ పలువురు జిల్లా నేతలు మంగళవారం అమలాపురం పార్టీ కార్యాలయంలో కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు ఆకుల వీరబాబు, జిల్లా వైస్ ప్రెసిడెంట్ అయ్యల భాస్కరరావు, వేగి వెంకటేశ్వరరావు, అరిగెల నాని, గోకర కొండ గంగన్న స్వామి, దాకే వెంకటరావు, యనమదల వెంకటరమణ, చొల్లంగి త్రినాథ్, కనకాల దొరబాబు పాల్గొన్నారు.