సీఎంఆర్ఎఫ్,కళ్యాణ లక్ష్మి, చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే
NEWS Jan 20,2025 05:10 pm
కోరుట్ల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పట్టణ, మండలానికి సంబంధించిన లబ్ధిదారులకు మంజూరైన కళ్యాణలక్ష్మి, షాదీముబారక్, సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ సోమవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా 26 మంది లబ్ధిదారులకు రూ.26,03,016 విలువ గల కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులతో పాటు 35 మంది లబ్ధిదారులకు రూ.4,55,000 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు.