అంగలి మండలంలో ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు
NEWS Jan 18,2025 12:22 pm
ఆగలి మండల కేంద్రంలో శనివారం ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలను స్థానిక టిడిపి నేతలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఎన్టీఆర్ సర్కిల్లో ఎన్టీఆర్ విగ్రహానికి టీడీపీ నాయకులు పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నాయకులు ఈ సందర్భంగా జెడ్పిటిసి ఉమేష్ మాట్లాడుతూ.. నేడు ప్రజలు సంతోషంగా ఉన్నారంటే దానికి కారణం టీడీపీ అని అన్నారు. జోహార్ ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేశారు. ఎన్టీఆర్ అడుగుజాడల్లో నడిచి ఆయన ఆశయాలను కొనసాగిస్తామని పేర్కొన్నారు.