స్వచ్ఛత..శుభ్రత జీవన విధానం కావాలి
NEWS Jan 18,2025 08:47 am
స్వచ్ఛత, శుభ్రత ప్రజల జీవన విధానం కావాలని పిలుపునిచ్చారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రతి ఇంటి నుంచి చెత్త రహిత సమాజం ఆలోచన పుట్టాలన్నారు. స్థానిక సంస్థలు సైతం చెత్త వినియోగం మీద ప్రణాళికతో ముందుకు వెళ్లాలన్నారు. ప్రతి నెలా మూడో శనివారం ‘స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివస్’ పక్కాగా నిర్వహించాలన్నారు. వికసిత్ భారత్ లో పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు.