సర్కార్ బడుల పరిస్థితి మారడం లేదు. ప్రభుత్వాలు మారినా బడి పరిస్థితుల్లో మార్పు కనపడటంలేదు. రామారెడ్డి మండలం బట్టతండా ప్రాథమిక పాఠశాలలో 61 మంది విద్యార్థులు ఉన్నారు. వీరందరికీ ఒకే తరగతి గది ఉండడంతో చెట్ల కింద బోధన చేయాల్సి వస్తోంది. గతంలో ఈ తండాను పంచాయతీగా మార్చడంతో బడి తరగతి గదిని గ్రామ పంచాయతీకి కేటాయించారు. మరో తరగతి గదిని నిర్మించాల్సింది పోయి ఉన్న తరగతి గదిని గ్రామ పంచాయతీకి ఇవ్వడంతో చెట్ల కిందే బోధన చేయాల్సిన పరిస్థితి తలెత్తింది.