మెట్రో విస్తరణపై సీఎం సమీక్ష
NEWS Jan 07,2025 10:37 pm
సీఎం రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ మరింత పెంచేందుకు గాను ఫోకస్ పెట్టారు. తన నివాసంలో సమీక్ష చేపట్టారు. ప్రధానంగా ఎలివేటెడ్ కారిడార్లు, రేడియల్ రోడ్లు, మెట్రో విస్తరణపై చర్చించారు. రోజు రోజుకు నగరంలో జనాభా పెరుగుతోందని, అందుకు అనుగుణంగా మార్పులు చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించాలన్నారు.