జగిత్యాల జిల్లాలో 7,20,566 మంది ఓటర్లు
NEWS Jan 06,2025 02:57 pm
జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సత్య ప్రసాద్ ఆదేశాల మేరకు ఓటర్ల జాబితా తుది ప్రచురణ ను అధికారులు విడుదల చేశారు. జగిత్యాల జిల్లాలో ఈనెల 6 నాటికి 7,20,566 మంది ఓటర్లు నమోదు చేసుకున్నట్లు ప్రకటించారు. అలాగే సర్వీస్ ఓటర్లు 237 మంది నమోదయినట్లు పేర్కొన్నారు. కాగా పొలిటికల్ పార్టీ ప్రతినిధులకు ప్రచురించిన ఓటర్ జాబితాను అందజేసి అభిప్రాయాలను సేకరించారు.