కేరళలోని శబరిమలకు పోటెత్తారు అయ్యప్పస్వామి భక్తులు. 24 గంటల్లో లక్ష మందికి పైగా భక్తులు దర్శించుకున్నారు. ప్రస్తుతం స్వామిని దర్శించుకునేందుకు 10 గంటలకు పైగా సమయం పడుతోంది. స్పాట్ దర్శనానికి 20 వేల టికెట్లు ఇచ్చింది ఆలయ ట్రస్టు. పంబ నుంచి సన్నిదానం వరకు పెద్ద ఎత్తున భక్తులు క్యూ లైన్లోనే వేచి ఉన్నారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా వసతి సౌకర్యాలు ఏర్పాటు చేశారు.