రైతు భరోసా రూ. 15 వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మానకొండూరు లో సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆధ్వర్యంలో దగ్ధం చేశారు. ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిన సీఎంకు తమ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ సర్కార్ కు షాక్ ఇవ్వక తప్పదన్నారు.