కేటీఆర్ కామెంట్స్ చామల సీరియస్
NEWS Jan 06,2025 04:58 am
కేటీఆర్ పై నిప్పులు చెరిగారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. రైతుల విషయంలో మీకు మాకు పోలికా అంటూ ఎద్దేవా చేశారు. వరి వేస్తే ఉరేనంటూ కామెంట్ చేసిన మీకు తమ ప్రభుత్వాన్ని, సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక ధాన్యం రికార్డు సృష్టించామని, మాటిచ్చిన ఏడాది లోపే రూ. 2 లక్షల రైతు రుణ మాఫీ చేశామన్నారు. కేటీఆర్ త్వరలోనే అరెస్ట్ కావడం ఖాయమన్నారు.