ఘనంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి జన్మదిన వేడుక
NEWS Jan 05,2025 02:14 pm
రాయికల్ పట్టణంలోని స్థానిక గాంధీ చౌక్ వద్ద పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి జన్మదిన వేడుకలు కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం యూత్ నాయకులు రాజీవ్, నాగరాజు ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు రమేష్, సీనియర్ నాయకులు నర్సయ్య, జక్కుల సాగర్, జలపతి తదితరులు పాల్గొన్నారు.