వెంటనే నియామక పత్రాలు ఇవ్వండి
NEWS Jan 04,2025 11:52 am
విద్యుత్ శాఖలో జూనియర్ అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటర్ అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వక పోవడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కొంచెం సమయం కేటాయించాలని అన్నారు. జెన్ కోలో ఇంజనీర్లు, కెమిస్టులు నియామక పత్రాల కోసం గత మూడు నెలలుగా వేచి చూస్తున్నారని వారిని పట్టించుకోక పోవడం దారుణమన్నారు.