సవాళ్లను స్వీకరించం నాకు ఇష్టం
NEWS Jan 04,2025 11:28 am
సవాళ్లను ఎదుర్కోవడం తనకు అత్యంత ఇష్టమని అన్నారు మంత్రి నారా లోకేష్. చాలా మంది విద్యా శాఖను తీసుకునేందుకు ఇష్టపడరని కానీ తాను ఛాలెంజ్ గా తీసుకున్నానని చెప్పారు. టఫ్ టాస్క్ తీసుకోవడాన్ని గర్వంగా ఫీలవుతానని అన్నారు. ఎప్పుడూ గెలవని మంగళరిని ఎంచుకున్నానని, చివరకు క్లిష్టమైన ఐటీ, విద్యా, కమ్యూనికేషన్స్ శాఖలను తీసుకున్నానని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి జీవితాన్ని ఓ పరీక్షగా తీసుకోవాలని సూచించారు.