సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో అల్లు అర్జున్ కు భారీ ఊరట లభించింది. ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీసుల ఎదుట హాజరు కావాల్సి ఉంటుందని న్యాయవాది అశోక్ రెడ్డి స్పష్టం చేశారు. బన్నీకి షరతులతో కూడిన రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిందన్నారు. పోలీస్ విచారణకు పూర్తిగా సహకరించాలని ఆదేశించిందని తెలిపారు. కాగా అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్ పై ఈనెల 21న హైకోర్టులో విచారణకు రానుంది.