ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో నిలిచిన ఫ్లైట్స్
NEWS Jan 04,2025 05:22 am
దట్టమైన పొగమంచు కారణంగా ఢిల్లీ ఎయిర్ పోర్టు లో 100కు పైగా విమానాల రాక పోకలపై ప్రభావం చూపింది. ఫ్లైట్స్ ల్యాండింగ్ , టేకాఫ్ లో తీవ్ర సమస్యలు ఏర్పడ్డాయి. పెద్ద ఎత్తున విమానాల షెడ్యూల్ లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఇప్పటి వరకు ఎయిర్ పోర్టు నుంచి వెళ్లే 30 ఫ్లైట్స్ ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. గరిష్ట సంఖ్యలో ఇండిగో విమానాలు రద్దయ్యాయి. ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.