ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి
NEWS Jan 04,2025 05:56 am
మల్లాపూర్ మండలం పాతదాంరాజ్‌పల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో శుక్రవారం సావిత్రి బాయి పూలే జయంతి సందర్భంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈఓ కేతిరి దామోదర్ రెడ్డి మాట్లాడుతూ.. భారత దేశ తొలి మహిళా ఉపాద్యాయురాలు సావిత్రి బాయ్ పూలే గొప్ప సంఘ సంస్కర్త అన్నారు. అనంతరం మహిళా ఉపాద్యాయురాలు భవానిని ఘనంగా సన్మానించారు. ఉపాధ్యాయులు వేణు,భవాని, అరుణ్ లు పాల్గొన్నారు.