కవితల పోటీల్లో విద్యార్థులకు బహుమతులు
NEWS Jan 03,2025 11:46 am
కెనడా దేశం కేంద్రంగా ప్రపంచవ్యాప్తంగా పిల్లల మాసపత్రిక గడుగ్గాయ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి కవితల పోటీల్లో మోపాల్ మండలంలోని సిర్‌పూర్ ఉన్నత పాఠశాల విద్యార్థులు బహుమతులు సాధించారు. పాఠశాలలో విద్యార్థులను హెచ్‌ఎం సత్యనారాయణ, ఉపాధ్యాయులు అభినందించారు. అనంతరం హెచ్‌ఎం మాట్లాడుతూ తెలుగు విద్యార్థులందరికీ కవితా పోటీలను గత నెలలో నిర్వహించారని, అందులో భాగంగా తమ పాఠశాల విద్యార్థులు కవితలు పంపారని తెలిపారు. జనవరి 1న విజేతల జాబితాను విడుదల చేశారన్నారు.